societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026 Editor : Society News

డాక్టర్ రవికిరణ్ కు శుభాకాంక్షల వెల్లువ..

ప్రముఖ హోమియోపతి వైద్యుడు, సినీ నిర్మాత,సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాడిగిరి రవికిరణ్ యాదవ్ ఇటీవలే ఉత్తమ హోమియో వైద్య అవార్డును అందుకున్నారు.కాగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది.ఇందులో భాగంగానే సాయి వైకుంఠ ట్రస్ట్ లో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కె.గట్టయ్య, రిటైర్డ్ తహసీల్దార్ ముస్కు రాజేశ్వర్ రెడ్డి, రాజన్న, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు స్వామి ఆయనను శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అంకిత భావంతో ఆయన అందించిన విశేష వైద్య సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కిందన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం గర్వకారణమన్నారు.ఇందులో మాస్టర్ హోమియోపతి హాస్పిటల్ స్టాఫ్, సాయి వైకుంఠ ట్రస్ట్ బాధ్యులు పాల్గొన్నారు.